Ram Charan Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి, రెండు గ్లింప్స్‌లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, పుట్టినరోజు ప్రత్యేక గ్లింప్స్‌కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై […]
Ram Charan Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రమోషనల్ కంటెంట్ తో మ్యాసీవ్ బజ్ క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి, రెండు గ్లింప్స్‌లలో రామ్ చరణ్ డిఫరెంట్ అవతార్స్ లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, పుట్టినరోజు ప్రత్యేక గ్లింప్స్‌కు ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించగా, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం విడుదల దిశగా ముందుకు సాగుతోంది.
Ram Charan’s Peddi Releasing Worldwide In June
సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర బృందం ఇప్పుడు అధికారికంగా ధృవీకరించింది. మేకర్స్ నుండి వచ్చిన ఒక అధికారిక ప్రకటన ప్రకారం ‘పెద్ది’ జూన్‌లో థియేటర్లలోకి రానుంది. సినిమా ఎడిటింగ్‌ను సమీక్షించిన తర్వాత, అవుట్‌పుట్ పై గొప్ప సంతృప్తిని వ్యక్తం చేశారు, అబ్సల్యూట్ పర్ఫెక్షన్ కోసం పోస్ట్-ప్రొడక్షన్ కు అదనపు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ప్రేక్షకులకు అత్యుత్తమమైన, గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ వంటి అద్భుతమైన తారాగణం కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బృందం పని చేస్తోంది. ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీని, ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించగా, నవీన్ నూలి ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ