Dacoit Movie Review : అడవి శేష్ అనగానే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకొస్తాడనే నమ్మకం ప్రేక్షకులది. చాలా కాలం విరామం తరువాత ఆయన ఈ సారి ‘డెకాయిట్’ అనే రొమాంటిక్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కథ, స్క్రీన్‌ప్లేను కూడా ఆయనే సమకూర్చి ఈ చిత్రాన్ని అడవి శేష్ తీర్చిదిద్దాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని సుప్రీయ యార్లగడ్డ, సునీల్ నారంగ్‌లు నిర్మించారు. మంచి బజ్‌తోనే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో.. కథ ఏమిటో తెలుసుకుందాం..
కథ: హరిదాస్ ( అడవి శేష్) జైలు జీవితం గడుపుతుంటాడు. తనపై ఈ నేరం మోపి జైలుకు పంపించడానికి కారణమైన తన ప్రేయసి సరస్వతి (మృణాల్ ఠాకూర్)పై ప్రతీకారం తీర్చుకోవడానికి జైలు నుంచి తప్పించుకుంటాడు. ఇందుకు ఇషాద్ బాయ్ (అతుల్ కులకర్ణి) సహాయం చేస్తాడు. జైలు నుంచి తప్పించుకున్న హరిదాస్‌ను దుబాయ్‌కు పంపించాలని ప్లాన్ చేస్తాడు ఇషాద్ బాయ్.
అయితే దుబాయ్ వెళ్లడానికి కావాల్సిన మనీ కోసం ఓ ప్లాన్‌ను వేస్తాడు హరిదాస్. ఈలోపు తన ప్రియురాలిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆమెని కలుస్లాడు. అయితే పెళ్లి చేసుకని ఓ కూతురితో సరస్వతి దర్శనమిస్తుంది. తను చేయబోయే దోపిడికి ఆమె బలహీనతను క్యాష్ చేసుకోని, ఆమెని ఈ నేరంలో ఇరికించాలనుంటాడు. అయితే ఆమె పరిస్థితిని తెలుసుకున్న హరిదాస్ మనసు మార్చుకుంటాడు.

ఇక ఆ తరువాత జరిగిందేమిటి? సరస్వతి కూడా డబ్బులు ఎందుకు అవసరం? హరిదాస్ చేయాల్సిన దోపిడి చేశాడా? లేదా? సరస్వతి, హరిదాస్ మధ్యలో ఏం జరిగింది? హరిని సరస్వతి మర్డర్ కేసులో ఇరికించడానికి కారణమేమిటి? ఇందుకు భాస్కర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలో సీఐ రాంబాబు (అనురాగ్ కశ్యప్) పాత్ర ఏమిటి? కరుణ హస్పిటల్స్ ఎం.డి ప్రకాష్ రాజ్, మల్లి (కామాక్షి భాస్కర్ల)లకు ఈ కథకు ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.చివరకు ఈ సినిమా ముగింపు ఏమిటి అనేది సినిమా చూస్తే తెలుస్తుంది.
విశ్లేషణ:
రొటిన్ కథతో, బోరింగ్ స్క్రీన్‌ప్లేతో అడవిశేష్ మాస్ హీరోగా ఎదిగేందుకు చేసిన ప్రయత్నం ఇది. కథ, కథనాల్లో ఏ మాత్రం నవ్యత లేదు. స్క్రీన్‌ప్లేలో ఏ మాత్రం లాజిక్‌లు పట్టించుకోలేదు. కన్వీనెంట్ రైటింగ్‌తో అడవి శేష్ తన హీరోయిజాన్ని ఎలివేట్ చేసుకునేందుకు చేసిన ఈ ప్రయత్నం పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు. టెక్నకిల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న ఈ చిత్రంలో కొన్ని యాక్షన్ ఏపిపోడ్స్ అలరిస్తాయి. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్‌సీన్స్ బోరింగ్‌గా ఉంటాయి. ఏ పాత్రకు సరైన ఔచిత్యం కనిపించదు. సినిమా ఓపెనింగ్‌లో వచ్చే లవ్‌సీన్స్ ఎంతో బోరింగ్‌గా ఉంటాయి. దాంతో తదుపరి సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుంది. సినిమా ఆద్యంతం స్లోగా నడుస్తుంది.
ముఖ్యంగా స్క్రీన్‌ప్లేలో ఎలాంటి వేగం కనిపించదు. సెకండాఫ్‌లో కొన్ని యాక్షన్ ఏపిసోడ్స్ మాత్రం ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచుతుంది. సెకండాఫ్‌లో కూడా అక్కడక్కడా మాత్రమే ప్రేక్షకులు రిలీఫ్ ఫీలవుతారు. ముఖ్యంగా పతాక సన్నివేశాలు ట్విస్ట్‌ను రివీల్ చేయడానికి ఎటువంటి లాజిక్‌లు పట్టించుకోలేదు. సన్నివేశాలకు అనుగుణంగా క్యారెక్టర్స్ స్వభావాలు మార్చేస్తారు. ఇక ఆ పతాక సన్నివేశాలు కన్వీన్సింగ్ అనిపించినా.. ఇంతకు ముందు పాత సినిమాల్లో ఉండే క్లైమాక్స్‌నే అది గుర్తు చేస్తుంది. హీరో అడవి శేష్ తన క్యారెక్టర్‌ను మోర్ మాసివ్‌గా ప్రజెంట్ చేయడానికి పడిన తపన, కథ, స్క్రీన్‌ప్లేను రాసుకోవడంలో కనిపించలేదు. మోస్ట్ కంఫర్టబుల్, అండ్ కన్వీనెంట్ రైటింగ్ ఈ సినిమాలో కనిపిస్తుంది.
హరిదాస్ పాత్రలో అడవి శేష్ న్యూలుక్‌లో కనిపించాడు. కానీ క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ కుదరలేదు యాక్షన్, ఎమోషన్స్ సన్నివేశాల్లో మాత్రం నటనలో మెప్పించాడు. సరస్వతిగా మృణాల్ ఠాకూర్ పాత్ర హరిదాస్ పాత్రకు పోటా పోటిగా ఉంది. సిఐగా అనురాగ్ కాశ్యప్ యాప్ట్ అనిపించాడు. జ్ఞాని నేపథ్య సంగీతం, ఫోటోగ్రఫీకి ప్రశంసనీయంగా ఉంది
ఓవరాల్‌గా అక్కడక్కడ మ్యాజిక్ చేసిన ఈ డెకాయిట్‌కు ఈ వీకండ్‌లో మంచి వసూళ్లు కనిపించినా.. లాంగ్‌రన్‌లో బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశాలు తక్కువే.. ఓవరాల్‌గా ఈ డెకాయిట్ ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది.
రేటింగ్ 2/5

