Thursday, April 9, 2026

Oh Sukumari : తిరువీర్ ‘ఓ..! సుకుమారి’ షూటింగ్ పూర్తి

Oh Sukumari : యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్  తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి  విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్స్ కి […]


59
/ 100


SEO Score

Oh Sukumari : యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్  తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి  విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’ చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు.విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా ‘శివం భజే’ తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే  విడుదలైన ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Oh sukuamri
Oh sukumari

తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటో లో హీరో తిరువీర్ తో పాటు టీమ్ మొత్తం ఒకేచోట చేరి సెలబ్రేట్ చేసుకుంటూ హ్యాపీ వైబ్ లో కనిపించారు.ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం సినిమాకి పని చేస్తోంది. రజాకార్, పోలిమేర చిత్రాలకు సినిమాటోగ్రఫీ చేసిన సి.హెచ్. కుషేందర్ ఈ చిత్రానికి కెమెరామ్యాన్. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం సమకూరుస్తారు. బలగం ఫేం తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ డైరెక్టర్‌, క చిత్రానికి ఎడిటింగ్ చేసిన శ్రీ వరప్రసాద్ ఎడిటర్‌. స్వయంభు చిత్రానికి పని చేస్తున్న అను రెడ్డి అక్కటి ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్. పాపులర్ లిరిక్ రైటర్ పూర్ణచారి ఈ చిత్రంలోని పాటలు రాస్తున్నారు.

‘ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow

Latest Articles